
వరంగల్ వాయిస్, హనుమకొండ : మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా వడ్డేపల్లి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్,సర్వోదయ మిత్రమండలి సంయుక్తంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించి అనంతరం అవసరమైన విద్యార్థులకు శుక్రవారం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్, 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్ అద్దాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డా. సుప్రియ దేశ్ పాండే, అనిరుద్ దేశ్ పాండే, వినాయక హాస్పిటల్ చైర్మన్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బిజెపి జిల్లా ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ నాగపురి అశోక్, డివిజన్ అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, యాదగిరి, ప్రవీణ్, నరేష్, శివ, సంతోష్, రాము, గుండె అశోక్, యూత్ అధ్యక్షులు బాబీ, ఓబీసీ సెల్ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.