వరంగల్ వాయిస్,హనుమకొండ: గౌతమ్ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థిని నాగపురి హాసిని ఈ సంవత్సరం ఇంటర్ బైపీసీలో 440/438 మార్కులు రాష్ట్రం లో మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా శనివారం వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు హాసిని ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన వర్థన్నపేట నియోజకవర్గం హాసన్ పర్తి మండల పరిధి నుంచి మొదటి స్థానం సంపాదించటం చాలా గర్వకారణమని అలాగే రాబోయే రోజుల్లో మరింత ఉన్నత విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలు గా సహకరిస్తామని అన్నారు.రాష్ట్ర స్థాయిలో సాధించడానికి కృషి చేసిన గౌతమి జూనియర్ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, తంగళ్ళపల్లి తిరుపతి కళాశాల డైరెక్టర్స్ సందరాజు సంతోష్,మంతెన బిక్షపతి,గొట్ట లక్ష్మణ్,బండి పరశురాం,మల్ల ధనుంజయ్,అంబిర శ్రీకాంత్ పాల్గొన్నారు.
