వరంగల్ వాయిస్, మల్హర్ : మరి కొన్ని రోజుల్లో వర్షాకాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల రైతులకు మండల వ్యవసాయ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో ఏఈవోలు విత్తన కొనుగోలు అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తన ప్యాకెట్, రశీదు పంట కాలం పూర్తి అయ్యే వరకు భద్రపరచుకోవాలని, లూజు గా ఉన్న విత్తన ప్యాకెట్లు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని ఈ సందర్బంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు అనూష, శిరీష, మనీషా, రైతులు పాల్గొన్నారు.
