- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్
వరంగల్ వాయిస్, వరంగల్ : విత్తనాలు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాలు షాప్ ల వద్ద బార్లు తీరుతున్నారు. దీంతో షాప్ యజమానులు ఇష్టారీతిన ఎక్కువ ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నా వ్యవసాయ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా డీఆర్ఓ శ్రీనివాసులు ను కలిసి అగ్రికల్చర్ వాళ్లు పర్యవేక్షణ చేయడం లేదని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్, సోమ రామ్మూర్తి సంఘ సలహాదారులు మాట్లాడుతూ 1993 సంవత్సరం కాలం నుంచి డాంకల్ ప్రతిపాదన అనే పేరుతో బహుళ జాతి కంపెనీల విత్తనాలను దిగుమతి చేస్తూ రైతులకు దిగుబడులు పెరుగుతాయని పాలకులు చెబుతూ వస్తున్నారు. కానీ ఆ కాలంలో విత్తనాలు ఎలాంటి కల్తీ లేకుండా తమ విత్తనాన్ని తామే తయారు చేసుకునే విధంగా ఉండేవి. రైతులు బహుళ జాతి కంపెనీల విత్తనాలను భారతదేశంలో దిగుమతి చేయడంతో రైతులు ఆ కంపెనీల విత్తనాలను కొనవలసి పరిస్థితి వచ్చింది. దీంతో కొంతమంది షాపులో యజమానులు నకిలీ విత్తనాలు తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఏవీ మంచివో ఏవీ నకిలీవో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ఉంటున్నారు. వరంగల్ జిల్లాలోని అనేక విత్తనాల షాపు యజమానులు విత్తనాలు దొరకవనే నెపంతో రైతు దగ్గర అడ్వాన్సులు కట్టించుకునే విధంగా షాపు యజమానులు ప్రయత్నిస్తున్నారు. అంతే కాకుండా, మార్కెట్లో రైతు అడిగిన విత్తనాలే లేవని చెబుతూ కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇలా ఎక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధనకార్యదర్శి ఓదెల రాజయ్య, ఊరటి హంసల్ రెడ్డి, నల్ల విజేందర్ రెడ్డి, సిరుల రవీందర్, మొకిడే పేరయ్య, తదితరుల పాల్గొన్నారు.
