- జువైనల్ హోమ్ కు తరలింపు
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు నడిపిన 8 మంది మైనర్లను గుర్తించి శుక్రవారం జువైనల్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయగా, వీరికి రెండు రోజులు బాలల అబ్జర్వేషన్ హోం కు పంపినట్లు మట్టేవాడ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. పోచమ్మ మైదాన్, ఎంజీఎం సెంటర్, పోతన రోడ్డు, బట్టల బజార్, హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లలో వాహనాలు నడుపుతున్న మైనర్ లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో తమ వాహనాలను మైనర్లు ఇవ్వొద్దన్నారు. మైనర్లు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే శిక్ష తప్పదని హెచ్చరించారు.