- ఇన్‌స్టాలో రాహుల్ పోస్ట్
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోని ’డిస్ క్వాల్గిªడ్ ఎంపీ’గా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. 2019 పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీపై లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీగా అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ (అనీనిణస।బబ) పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ’సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద చేపట్టిన దీక్షలో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని మోస్తూ రాహుల్ ఆర్మీ ట్రక్కు వెనుక నడిచిన సంఘటనను గుర్తు చేస్తూ ప్రియాం ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ’32 ఏళ్ల క్రితం, మా నాన్న (రాజీవ్ గాంధీ) భౌతిక కాయం అంత్యక్రియల కోసం తీన్‌మూర్తి భవన్ నుంచి బయలు దేరుతోంది. పార్థివదేహాన్ని మోస్తూ రాహుల్ నడి ఎండలో ఆర్మీ ట్రక్కు వెనకే నడిచారు. అప్పుడు మా నాన్న మృతదేహానికి త్రివర్ణ పతాకం చుట్టారు. కానీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్నను విూరు అవమానించారు. ఇప్పుడు ఆ అమరవీరుడి కుమారుడిని దేశద్రోహి అంటున్నారు. అతని దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ ఇంటిపేరును ఈ కుటుంబం ఎందుకు ఉపయోగించలేదని పార్లమెంటులో ప్రధాని ఎద్దేవా చేశారు. అలా ప్రశ్నించి విూరు మా మొత్తం కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని అవమానించారు’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ వీడియో షేర్ చేసిన రాహుల్.. ’నిజం, ధైర్యం, త్యాగం ఇది మా వారసత్వం. ఇదే మా బలం కూడా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
