ప్రమాదం అంచున ప్రయాణం పేరిట వరంగల్ వాయిస్ లో ఈ నెల 3న ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. ప్రమాదాలు జరుగకుండా శనివారం పాక్షికంగా ఏర్పాట్లు చేశారు. దారి పొడువునా కర్రలు పాతి వాటికి రిబ్బన్ లను అమర్చారు. దూరంనుంచి వచ్చే వాహనదారులకు సైతం కనిపించేలా వీటిని ఏర్పాటు చేశారు. అయితే పనులు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించాలని కోరుతున్నారు.
-వరంగల్ వాయిస్, వరంగల్
