- బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జిలతో నిరసన
వరంగల్ వాయిస్, బాలసముద్రం : తెలంగాణ లోగో మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్ అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. కాకతీయ తోరణం, చార్మినార్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఇముడింప చేసేలా ఉన్న గుర్తులను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రజల అభీష్టం మేరకు పాలన కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోగో మార్పు నిర్ణయం వెనక్కి తీసుకొని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నయిమోద్దీన్, చాగంటి రమేష్, బొల్లు రవి, ఎండీ మహమూద్, సంపత్, ఇస్మాయిల్, సందీప్, రాజేశ్వర్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
