వరంగల్ వాయిస్, హనుమకొండ : పట్టభద్రుల ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం 11వ డివిజన్ లో ఉన్న వరంగల్ రీజినల్ లైబ్రరీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమకారులను అందరిని తీన్మార్ మల్లన్న ఓటు వేసి చట్టసభలకు పంపాలని కోరారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని లైబ్రరీలో ఉన్న విద్యార్థులను నిరుద్యోగులను కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అల్వాల కార్తీక్, 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాన్నారపు సంగీత్,11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ లక్ష్మి సురేందర్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమ, వినయ్ కుమార్, గోవిందు, శ్వేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మమ్మద్, సమద్ భాయ్, గన్నారపు కమల్ కుమార్, గద్దల శివప్రసాద్, గోల్కొండ సాంబయ్య, ఇసంపెళ్లి క్రాంతి, రమేష్, పవన్, మహేష్, అభినయ్, సతీష్, డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
