వరంగల్ వాయిస్, మల్హర్ : లారీ ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మల్హర్ మండలంలోని నాగులమ్మ క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీనివాస్(18) గురువారం అడ్వాలపల్లి లంబాడీ తాండాలోని తమ బందువుల ఇంట్లో జరుగుతున్న తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడానికి తన బైక్ పై బయలుదేరారు. మండలంలోని నాగులమ్మ క్రాస్ రోడ్ నుంచి మల్లారం మధ్యలో తాడిచెర్ల వైపు వేగంగా వెళ్తున్న బొగ్గు టిప్పర్ ముందు ఉన్న లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో టిప్పర్ ముందు భాగంలో గల బంపర్ బైక్ పై వెళ్తున్న శ్రీనివాస్ కి తగిలి కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అక్కడికక్కడే మృతి చెందారు. యువకుడి మృతితో అన్సాన్ పల్లి, అడ్వాల పల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్, కాటారం సీఐ రంజిత్ రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
