వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో మేదరి వాడ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మజ్జిగ, అన్నదానం, ఉప్మా, అరటిపండు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం 60 రోజులు 85 మంది దాతలు 2,700 కిలోల మజ్జిగ పెరుగు, ఆరువేల లీటర్ల వాటర్, మూడు క్వింటాల అన్న వితరణ వీటన్నిటిని సుమారు 60 రోజుల్లో లక్ష మందికి పంపిణీ చేయడం గర్వకారణమన్నారు. సుమారు రెండు నెలపాటు నగరంలో ఉండే ప్రముఖులు, వైశ్యులు వారి వారి పుట్టినరోజులు, పెళ్లిరోజు, అదేవిధంగా జ్ఞాపకార్థం గుర్తు చేస్తూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కష్టపడి పనిచేసిన ఆర్యవైశ్య మిత్రబృందం నాయకత్వాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పాల మురళీధర్, అల్లాడి వీరభద్రయ్య, అల్లా పరమేశ్వర్, మిత్తింటి సురేందర్, చిన్నాల సురేష్, పుల్లూరి రఘు, యాద గణేష్, సొల్లేటి కళావతి, పాల జయప్రకాష్, ధనలక్ష్మి, సంపూర్ణ, వనజ, సుప్రియ, జ్యోతి, రాజమణి, రేపాల హరి, తాటిపెళ్లి రాజమణి, సోమ అనసూయ, అశోక్, యాదా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
