Warangalvoice

5369d94a 80f6 45be bdfe 44c45abcf3bb

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్

5369d94a 80f6 45be bdfe 44c45abcf3bb
  • వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
  • ఉప్పల్ – భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన

వరంగల్ వాయిస్ , క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం వెల్లడించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, ఆర్అండ్ బీ , స్థానిక ప్రజా ప్రతినిధులతో కల్సి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సి చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వాహనాల వేగాన్ని తగ్గించేందుకుగాను స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, సైన్ బోర్డు భీంపల్లి క్రాస్ వద్ద డివైడర్ల ఏర్పాటు చేయడంతో పాటు, సర్వీసు రోడ్ నుంచి ప్రధాన రోడ్లు కలిపే సర్వీసు రోడ్లపై సైతం డివైడర్ల ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో రోడ్డు నివారణ కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగం పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలుపై ఈ విభాగం అధికారులు నివేదిక అందజేస్తారన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు అదేశించడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. రోడ్డు పరిశీలించిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, రోడ్డు భవనాల డీఈఈ గౌస్, కమలాపూర్ ఇన్ స్పెక్టర్ సంజీవ్, ఇంజినీరింగ్ విభాగం ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్, ఎస్.ఐలు, సతీష్, చరణ్, సర్పంచ్లు దేవేందర్ రావు, తిరుపతిరెడ్డి, ఉప్పల్ ఎంపీటీసీ సంపత్ రావు, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ సంపత్ రావుతో ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *