Warangalvoice

img 20220802 wa00042904241205609444802

రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్య‌క్షుడిగా అశోక్‌బాబు

నూత‌న క‌మిటీ ప్ర‌మాణ స్వీకారం

వ‌రంగ‌ల్ వాయిస్‌, ఖిలా వ‌రంగ‌ల్ : రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సం సోమ‌వారం కాశిబుగ్గలోని వేడుకల మందిరంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ గవర్నర్ డాక్ట‌ర్‌ శరత్ బాబు నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. క్లబ్ ప్రెసిడెంట్‌గా బేతి అశోక్ బాబు, సెక్రటరీగా భేతి సతీష్, కోశాధికారిగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సంద‌ర్భంగా నూత‌న అధ్యక్షుడు బేతి అశోక్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంలో రోట‌రీ క్లబ్ ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పేదలకు ఐదు కుట్టుమిషన్లు, స్కూలుకు పోయే పిల్లలకు ఐదు సైకిళ్లు ఉచితంగా అందజేశారు. కాశిబుగ్గ ఎస్సార్ నగర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల‌కు ప్యాడ్స్, బుక్స్, బ్యాగ్స్, షూస్, చైర్స్ అందించారు. బేతి అశోక్ ఆధ్వర్యంలో 25 మంది సభ్యులుగా చేరారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి త‌హ‌సీల్దార్ కుసుమ సత్యనారాయణ, గత సంవత్సర క్లబ్ ప్రెసిడెంట్ పోరండ్ల రత్నాకర్, సీనియర్ రొటీరియన్స్ జూలూరు కృష్ణమూర్తి, వడ్నాల సదానందం, చకిలం మహేందర్, ఉపేందర్, వేణు, నాగేశ్వరరావు, కుసుమ సత్యనారాయణ, జూరతి శ్రీనివాస్, రాజు, కిరణ్, కారు హరి, సతీష్, వెంకట్, బోడపాటి సూర్యనారాయణ, సురేందర్, ఇతర క్లబ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

img 20220802 wa00042904241205609444802
Warangal Voice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *