రైల్వే రిపేరు వర్క్ పేరిట ప్రజలను మోసం
రాబోయే ఎన్నికల కోసం పార్టీల స్టంట్
కాజీపేట తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్

వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ (పి ఓ హెచ్), వ్యాగన్ తయారీ పరిశ్రమ విషయంలో గత నాలుగైదు రోజులుగా మీడియాలో, పత్రికలలో కాజీపేట ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేసేవిదంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ పరిశ్రమల పైన అవగాహన లేకుండా, ఒక పెద్ద డ్రామాలు మాట్లాడుతున్నారన్నారు. అందుకే తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో కాజీపేట తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్ కో, కన్వీనర్ పాక వేద ప్రకాష్ మాట్లాడుతూ
తెలంగాణ రైల్వే జాక్ 2011 పిబ్రవరి నెలలో ఆవిర్భావం రైల్వే సమస్యల పైన కాజీపేట జంక్షన్ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న విషయం ఈ ప్రాంతంలోని ప్రజానీకానికి తెలిసిందే అని, అప్పటి నుండి ఈ రోజు వరకు అదే పోరాట పటిమతో ముందుకు నడుస్తున్నదని చెబుతూ 2009 తొమ్మిదిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం లోని రైల్వే మంత్రి మమతా బెనర్జీ కాజీపేటకు వ్యాగన్ తయారీ పరిశ్రమల పి పి పి ద్వారా నెలకొల్పేందుకు బడ్జెట్లో ప్రకటన చేసి 20 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాదాయ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున భూ కేటాయింపులు రైల్వే శాఖ కు ఇవ్వాలేకపోవడంతో… నాలుగు సంవత్సరాల జప్యం కావడంతో ఈ పరిశ్రమకు కేటాయించి 20 కోట్ల రూపాయలను 2014 లో అప్పటి రైల్వే మంత్రి అయినటువంటి మల్లికార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రలోని ఆయన నియోజకవర్గంలో గల యద్గిర్ ప్రాంతాల్లో లాఫ్ ఆఫ్ బుష్ యూనిట్కు తరలించుకొని అక్కడ ఆ పరిశ్రమ స్థాపించుకోవడం వలన రైల్వే జాక్ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగిందని తెలిపారు..తదనంతరం రైల్వే జాక్ చైర్మన్ కోండ్ర నర్సింగారావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో ఆర్టికల్ 13 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్థలం కేటాయిస్తే ఆరు నెలలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని పార్లమెంటు సాక్షిగా జీవో ఇచ్చి ఇవ్వక పోవడంతో తెలంగాణ రైల్వే జాక్ ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నీ రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, కమ్యూనిస్టు పార్టీలను, కాజీపేట వర్తక సంఘం యువజన సంఘాలను, రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను, మహిళా సంఘాలను కలుపుకుని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అనంతరం ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు, నిరవధిక దీక్షలు చేపట్టి రాష్ట్ర స్థాయి అన్నీ రాజకీయ పార్టీల నాయకులను కలిసి కాజీపేట జంక్షన్ కు మంజూరు అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని కోరడం ఈ ప్రధానమైన డిమాండు వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిన 2016-17 రైల్వే బడ్జెట్ లో కాజీపేట కు రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ను మంజూరు చేసిందని దానికి కావాల్సిన 160 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం భూములను 2021 సెప్టెంబర్ 23 తేదిన వరంగల్ జిల్లా అప్పటి కలెక్టర్ గారిని ఎస్.సి సికింద్రాబాద్ ఎ డి ఆర్ ఏం సుబ్రమణ్యం ని ఒక చోటికి చేర్చి చేర్చాలు రైల్వే జాక్ అధ్వర్యంలో జరిపించి వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ (పి ఓ హెచ్) కోసం కలెక్టర్ 150 ఎకరాల భూమిని మ్యూటేష చేశారని, కానీ ఇంకా పది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంటే రైల్వే జాక్ అధ్వర్యంలో కాజీపేట చౌరస్తాలో ఏప్రిల్ 23, 2023 రోజున “ధర్మ పోరాట దీక్ష” చేసి అట్టి భూమిని రైల్వే శాఖ కు ఇప్పించడంలో రైల్వే జాక్ సఫలీకృతం అయ్యిందని దాని ప్రభావం గానే కాజీపేటలో ఈ నెల 8 తేదిన మన దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతోందని అన్నారు.
తదనంతరం జాక్ వైస్ చైర్మన్ ఎ.సంతోష్ కుమార్ మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే లో ఆరు డివిజన్లలో సబ్ డివిజన్ అయినటువంటి కాజీపేట రైల్వే జంక్షన్ 46.8 % లాభాలను ఈ జోన్ కు ఇస్తుందని, కానీ కాజీపేట జంక్షన్ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయటం లేదని, ఈ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లయితే తప్పకుండా కాజీపేట జంక్షన్ డివిజన్ గా ఏర్పడుతుందని మనకు ప్రకటన కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం గొడవలు పడడం కంటే వచ్చిన వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్, వ్యాగన్ తయారీ పరిశ్రమను స్వాగతిస్తూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమం చేయాలని అన్నారు.
రైల్వే జాక్ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ… 1982 లో కాజీపేట కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరై చేజారి పోయిందని వరంగల్ జిల్లా ప్రజల నోటికాడి బుక్కను తీసుకెళ్లి పంజాబ్ లోని కపూర్తల ప్రజలకు అందించారని, తరువాత మరో కోచ్ ఫ్యాక్టరీ రాయబరేలిలో ఏర్పాటు చేసి మన ఆశలపై నీళ్లు చల్లారిన, తెలంగాణ రాష్ట్రం సాధించే ఉద్యమంలో 2011 ఆవిర్భావించిన “తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రం కోసం, రైల్వే అభివృద్ధి కోసం నిరసన, రైలురోకో లు, నిరసనలు, ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ధర్నాలు, చేసి నేడు కాజీపేట కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాక పోయినా కనీసం రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ (పి ఓ హెచ్), వ్యాగన్ తయారీ పరిశ్రమ సాధించుకోవడం జరిగిందని, వీటితోనే ఉద్యమం ఆగిపోలేదని, ఈ పరిశ్రమలు ఏర్పాటు అయిన తర్వాత కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే డివిజన్ మరియు కాజీపేట టౌన్ స్టేషన్ల అభివృద్ధి కోసం, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యాగన్ పరిశ్రమలో స్థానికుల ఉద్యోగ అవకాశాల కోసం మరో పోరాటం చేయాలని కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటం చేయాలంటే ఒక ప్రదాన సమస్య అడ్డోచ్చిందని అన్నారు. అదేంటంటే… తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కొండకల్ లో మేధా సంస్థ 09-02-2021 రోజున ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని మన రాష్ట్ర పుర పాలక శాఖ & ఐటి మంత్రి శ్రీ కె.టీ రామ రావు, ఆర్థిక మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. తరువాత 22 న మన రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారన్నారు. కనుక ఒక రాష్ట్రంలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉన్నాక, అదే రాష్ట్రంలో ఇంకో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరనీ, అందులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు సంస్థను ప్రోత్సహిస్తుంది కనుక, అది సాధించడం కాస్త కష్టమే అని, మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట జంక్షన్ లో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని,చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని అన్నారు. కానీ తెలంగాణ రైల్వే జాక్ పోరాటం ఆగదని, కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్, వ్యాగన్ తయారీ పరిశ్రమ కోసం ఆలస్యం అయినా రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించినందుకు, మా పోరాటంలో భాగస్వామ్యులైన అన్నీ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో ఉద్యమంలో మాతో కలిసి రావాలని వేడుకుంటున్నామని అన్నారు. ఈ నెల 8 వ తేదీన కాజిపేట్ రైల్వే వ్యాగన్ రిపేర్ వర్కుషాప్, వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు విచ్చేస్తున్నటువంటి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు శ్రీనివాస్, ఎం.కె మూర్తి, మాధవరావు, రవిందర్, ఏళ్లస్వామి, ప్రవీణ్ కుమార్, శ్రీను బాబు, లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.