- సమస్యలు ఉంటే దృష్టికి తేవాలి: ఎమ్మెల్యే
వరంగల్ వాయిస్,మెదక్: రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల తమదృష్టికి తేవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సిఎం కెసిఆర్ తన చిత్తశుద్దిని చాటిందన్నారు. రైతుకు ఇచ్చిన హావిూ మేరకు పనులు జరుగబోతున్నాయని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎప్పడు సిద్ధమేనని అన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధికి సర్కారు ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. రైతులు నష్టపోవద్దనే సదుద్దేశంతో పంటలకు నీరు వదులాలని నిర్ణయించామని అన్నారు. రైతులు తమ సమస్యలపై అధైర్య పడొద్దని ఆయన హితవు చేశారు.. రైతుల సంక్షేమం కోసం సర్కారు కొత్తగా ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్నట్లు చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో పని చేస్తుందని, రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల మేలు కోరి రైతు శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కారు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి, పంటల సాగు, వాటి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, కావాలనే రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. రైతులకు వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఎప్పుడు నమ్మొద్దని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం రైతులు బాగుంటనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతులు సుఖః సంతోషాలతో ఉన్నప్పుడే ఆశించినంత ధాన్యం, పంటల దిగుబడి సమృద్ధిగా వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతుకు బీమా పథకాన్ని తెచ్చారని ఎమ్‌మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రైతు బీమా పథకం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిదని అన్నారు. రైతుకు ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు ముందుంటున్నామని అన్నారు. రకరకాల ఇబ్బందులతో, పంటలపై పెట్టుబడులతో చేతిలో డబ్బులు లేని సందర్భంలో ఏదైనా కారణంతో రైతు మృతి చెందితే ఆ కుటుంబం నిరాధారమై పోతుందన్నారు. రైతు కోసం ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నారన్నారు. ఎకరానికి రూ. పదివేలు ఇవ్వడం రైతుబిడ్డగా కేసీఆర్ చేస్తున్న మంచి పనిగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
