- ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలుగు రాష్టాల్ర మధ్యన రెండవ వందేభారత్ రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8 వ తేదీన సికింద్రాబాద్ నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ ` తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్, తిరుపతి మధ్యన ప్రయాణానికి 11 నుండి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్ రైలు ద్వారా కేవలం 8 గంటల30 నిముషాల్లోనే గమ్య స్థానికి చేరుకుంటుంది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగనుంది.సాధారణ రోజుల్లో వందే భారత్ ట్రైన్ `నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. రెండో వందే భారత్ రైల్ కేటాయించినందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభోత్సవం రోజున మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కోరారు. సికింద్రాబాద్ ` తిరుపతి మధ్యన ఈ రైలు తన సేవలనందించనున్నట్లు తెలిపారు.
