వరంగల్ వాయిస్, మంగపేట : మంగపేట మండల కేద్రంలోని శ్రీ దుర్గా మోడరన్ రైస్ మిల్లులో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. శుక్రవారం వరంగల్ రీజనల్ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అడిషన్ ఎస్పీ రామారావు ఆదేశాల మేరకు ములుగు జిల్లా మంగపేట మండలంలో శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు పై దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 420 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని, 55 క్వింటాళ్ల బ్రోకెన్ రైస్ బియ్యాన్ని పట్టుకొని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని, మిల్లు ఓనరుపై తగు చర్యల తీసుకునేందుకు సివిల్ సప్లై అధికారులకు రిపోర్ట్ పంపటం జరిగిందని వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ రాకేష్ , పీసీ సుమన్ రెడ్డి, రమేష్ సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ రాంచందర్, మంగపేట రెవిన్యూ ఇస్పెక్టర్ నేత కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
