బిజెపి దాష్టీకాలకు పరాకాష్ట : ఇంద్రకరణ్
నిర్మల్: రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటువేయడాన్ని అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. బిజెపి దాష్టీకాలు పెరిగాయని, విపక్ష పార్లీలపై కక్షసాధింపు ధోరణితోకేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నిర్మల్ నియోజకవర్గం సోన్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంటల లోపే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం దారుణమన్నారు. ఇది అప్రజాస్వామికమని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఆన్నారు. ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిరచాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు Ñ సొన్ మండల కేంద్రంలో ని రాజ రాజేశ్వర స్వామి శివాలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. శివాలయం లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజ్యాంగ నిర్మాణ డా బి ఆర్ అంబేద్కర్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాలకు మంత్రి నివాళులర్పించారు.