వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లలో భారత రాష్ట్రపతి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చిత్ర పటాన్ని మహబూబాబాద్ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్ర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య, సీనియర్ నాయకులు శశి వర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభు వెంకటేశ్వర్లు, చీకటి మహేష్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంబాబు నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందు భారతి, జిల్లా ఉపాధ్యక్షులు మేరెడ్డి సురేందర్, గూడూరు మండల అధ్యక్షుడు మోతీలాల్, కేసముద్రం మండల అధ్యక్షుడు పొదిలి నర్సింహా రెడ్డి, సింగారపు సతీష్, రేష్మ, పద్మ తదితర జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
