వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దర్శనం రామకృష్ణకు మా అసోసియేషన్ తరపున అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ 1996 సంవత్సరం నుంచి తన కుటుంబ సభ్యులలో ఒకడిగా ఉండి ఎదిగిన దర్శనం రామకృష్ణ భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా మహబూబాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ముందుకు సాగాలని అన్నారు. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన దర్శనం రామకృష్ణ నిరుపేద కుటుంబంలో జన్మించి అణగారిన వర్గాల ప్రజలకు సహాయపడాలనే తపనతో లా విద్యను పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించారు.
