మాజీమంత్రి ఎన్‌ఎండి ఫరూక్ వరంగల్ వాయిస్,నంద్యాల: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో అధికార వైసిపికి కౌంట్‌డౌన్ మొదలయ్యిందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్ అన్నారు. వైసిపి పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసిపికి చెల్లుచీటి పలకడం ఖాయమని అన్నారు. పులివెందుల గడ్డ నుంచే తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని ఎగురవేసిందని, జగన్ పతనం అక్కడి నుంచే మొదలైందని అన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత అరాచకంగా పాలన సాగించారో ప్రజలే కాకుండా, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలుసుకున్నారని అన్నారు. అధికార మదంతో టీడీపీ నాయకులను, కార్యకర్తలను వైసీపీ నాయకులు ఎంత వేధించారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వేళ్ల విూద లెక్కపెట్టే సీట్లు మాత్రమే వైసీపీకి రాబోతున్నాయని అన్నారు. టీడీపీకి 175 స్థానాలు రావడం ఖాయమన్నారుతెలుగుదేశం పార్టీకి ఈ సంవత్సరం అన్ని శుభాలే జరుగుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం వీయనున్నదని మాజీ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అంతులేకుండా పోతుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పోరాడుతూ అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైసిపీఈని త్వరలో ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.