- కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్
వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో బీసీల డాక్టర్లకు అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, ఒక్క మంచి పోస్టులో కూడా డాక్టర్లు లేని పరిస్థితి ఉందని, దీనికంతటికి కారణం బీసీ రాజ్యాధికారం లేకపోవడమే అని, బీసీ నేత, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. గురువారం హనుమకొండలోని ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ హాజరై మాట్లాడారు. 76 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటికి బీసీలకు అధికారం రావడం లేదంటే విభజించి పాలించిన రాజకీయ నాయకులేనన్నారు. ఇప్పటికీ బీసీలందరూ ఒకటయ్యాం. ప్రతి గల్లీ గల్లీలో వాడవాడలో మండల మండలంలో గ్రామ గ్రామాన బీసీలకు జరుగుతున్న అన్యాయం, ప్రత్యేకంగా ఈడబ్ల్యూఎస్ పైన జరుగుతున్న అన్యాయంపైన ప్రతిరోజు చర్చించాలన్నారు . ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధభేరి జరిగే తీరుతుందన్నారు. లక్ష మందితో కాదు లక్షలాది మందితో యుద్ధభేరి జరగబోతుందన్నారు. ఈ యుద్ధ భేరి సభలో డాక్టర్లు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. అనంతరం కూరపాటి రమేష్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ రాజకీయ యుద్ధభేరి జరగబోతుందన్నారు. మా డాక్టర్ల తరఫున అందరం పూర్తి మద్దతుగా ఉండబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న చీప్ రాష్ట్ర అధ్యక్షుడు మాదం రజనీ కుమార్ యాదవ్, డాక్టర్ అసోసియేషన్ సభ్యులు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి రమేష్, డాక్టర్ కూరపాటి రాధిక, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎర్రం శ్రీధర్ రాజు, డాక్టర్ అంబటి అజయ్, డాక్టర్ రోహిణి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ వరుణ్ బాబు, డాక్టర్ కల్పగిరి సుధాకర్, డాక్టర్ దీప, డాక్టర్ మూర్తి, డాక్టర్ రవి, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, డాక్టర్ రాము వడిదల, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ శిరీష్, డాక్టర్ ఫిరిష్మా, తదితరులు పాల్గొన్నారు.