యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరి సభకు ముదిరాజులు మద్దతు తెలుపుతూ గురువారం హనుమకొండలోని హంటర్ రోడ్ లోని ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, భయ్యా స్వామి, పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ కులస్తులతో బీసీ రాజకీయ యుద్ధభేరి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే బోయిన అశోక్ ముదిరాజ్, బీసీ నేత, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజుయాదవ్ హజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న కులం ముదిరాజు కులం అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరాజ్ బిడ్డలు పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధభేరి సభకు తరలిరావాలన్నారు. అనంతరం బీసీ నేత, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ హలో బీసీ చలో వరంగల్ ఫిబ్రవరి 2న జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరి సభకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరు కాబోతున్నారన్నారు. ఈ సభకు ప్రతి బీసీ బిడ్డలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. గత 30 ఏళ్ల నుండి బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. 2028 లో బీసీ రాజ్యం రాబోతుందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు మాదం రజనీ కుమార్, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ముదిరాజ్ కులస్తులు కొండ మొగిలి, రాజ్ కుమార్, నీలం దుర్గేష్, చొప్పరి సోమయ్య, బూస మల్లేశం జోరిక సాదయ్య, దేవేందర్ భూమేష్, బీసీ సంఘ నాయకులు బుట్టి శ్యామ్ యాదవ్, గంగారం వేణుమాధవ్,పెద్ద ఎత్తున ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు.
