Warangalvoice

Warangal Voice

రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మయూరి ఆర్ట్స్ , తెలంగాణ అర్ట్స్ కల్చరల్ అకాడమీ, (భవిరి అర్ట్స్ )అధినేత మిమిక్రీ శివ ఆధ్వర్యంలో సోమవారము రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లి లో శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాలులో విశ్వ సంస్కృతి నంది పురస్కారాలు 2022 నిర్వహించారు. ప్రతిభ కల్గిన కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు ఈ నంది అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా మన వరంగల్ జిల్లాలోని 35 డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మిమిక్రీ ఆర్టిస్ట్ రాగి దామోదర్ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రతిభకు గుర్తింపుగా ఈ నంది పురస్కారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన సినీ నటులు కోటేశ్వరరావు, కిషోర్ దాస్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివ, ఆర్గనైజేషన్ మునుకోటి డేవిడ్ రాజు, డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేతుల మీదుగా ఈ నంది అవార్డ్స్ రాగి దామోదర్ అందుకున్నారు. మిమిక్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఎన్నో అవార్డ్స్ దక్కించు కోవాలని ఆ కళామ తల్లి దయవల్ల ఇవన్నీ జరగాలని అన్నారు. దామోదర్ కు నంది అవార్డు రావడం పట్ల మండల నరసింహారాములు రాగి సుభాష్ ప్రసన్న పాకాల రవీందర్ పూల మల్లికార్జున్ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *