హైదరాబాద్‌లో రోడ్లు, భవనాల చీఫ్ ఇంజనీర్‌కు గంట రవికుమార్ వినతి
వరంగల్ వాయిస్, వరంగల్ : గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిన వరంగల్ బట్టల బజార్ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు ఇతర ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నేత గంట రవికుమార్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ (రోడ్స్ అండ్ సీ ఆర్ ఎన్) పి.రవీందర్ రావు, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్(అడ్మినిస్ట్రేషన్) పింగళి సతీష్ లను కలిసి రోడ్ల దుస్థితిని తెలిపే ఛాయా చిత్రాలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. అనంతరం గంట రవి కుమార్ మాట్లాడతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి అడుగడుగునా గుంతలమయంగా మారి, ప్రమాదాలు జరుగతున్నాయంటూ వారికి వివరించినట్టు పేర్కొన్నారు. వరంగల్ మహానగరం రోడ్ల దుస్థితిపై చర్చించినట్టు తెలిపారు. వాల్ మార్ట్ నుంచి రంగశాయిపేట్ మీదుగా ఖిలా వరంగల్ కోట రోడ్డు డివైడర్ పనులు పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వారికి చెప్పినట్టు పేర్కొన్నారు. అలాగే వర్గాలకు ధ్వంసమైన ఆర్ అండ్ బి పరిధిలోని రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి, మహానగరంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని వారిని కోరినట్లు వెల్లడించారు.
===============
