
వరంగల్ వాయిస్, వరంగల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం భద్రకాళి ట్యాంక్ బండ్ పై వాకర్స్ కొద్ది సేపు యోగా చేశారు. వాకింగ్ తోపాటు యోగా చేయడంద్వారా ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవించవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. యగాతో మాసనిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ జి.పాండు, జీవీ రావు, సిద్ధిరాములు, రమేష్, సాంభశివుడు, తాటిపాముల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.