Warangalvoice

Telugu child in UK parliament

యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ

  • లేబర్ పార్టీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు
  • నాగరాజుది ఉమ్మడి కరీంనగర్ జిల్లా శనిగరం
    వరంగల్ వాయిస్, కోహెడ : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి తెలుగు బిడ్డ ఎంపికయ్యా రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్ని కల బరిలో నిలుస్తునారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ ప్రకటించింది. “నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ “బౌండరీకమిషన్ “సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కు లస్ పక్రారం నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్ లోనూ ఎన్నికల హడావిడి మొదలైంది. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ -పాలస్తీనా సంఘర్షణ, పప్రంచవ్యా ప్తంగా ఆర్థిక మాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్ని కల మీద పప్రంచ దేశాల దృష్టి కేంద్రీక్రీృతమై ఉంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచలుగా ఎదిగారు. బ్రిటన్ లోని పప్రంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు. పప్రంచ సమాజం, బావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనేథింక్-ట్యాక్ ని నెలకొల్పా రు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచి పట్టు ఉంది. స్కూ ల్ గవర్నర్ గా, వలంటీర్ గా, విస్తృత రాజకీయ పచ్రారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ పచ్రారంతో సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. దాదాపు అన్ని సర్వే సంస్థల పక్రారం ఈ ఎన్ని కల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి పభ్రుత్వం నెలకొల్పనుంది. ప్రఖ్యాత తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఈ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్ పార్టీ గెలుస్తుందని విశ్లేషించారు. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నా రు. ఈ నెల జరిగిన కౌన్సి లర్, రాష్ట్ర మేయర్ ఎన్ని కలోనూ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగు ముద్దు బిడ్డ ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
Telugu child in UK parliament
Telugu child in UK parliament

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *