
వరంగల్ వాయిస్, ములుగు: జిల్లా యువత కళలలో రాణించాలని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, కబట్టి ,వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ను స్ఫూర్తిగా తీసుకొని యువత చదువుతో పాటు సాంస్కృతిక రంగంలో రాణించాలన్నారు. ములుగు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇవి మొట్టమొదటిసారి యువజన ఉత్సవాలు అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి పి. వెంకటరమణ చారి, న్యాయ నిర్ణయితలుగా నరసింహ, తాడిచెర్ల రవి, సంధ్యా రాణి, అమ్మిన శ్రీనివాసరావు, పీఈటీలు చేరాలు, మల్లయ్య , వేణు, మధు అయా పాఠశాలల ఉపాధ్యాయులు కళాపోషకులు కళాకారులు పాల్గొన్నారు.