- KTR | దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలకిందులుగా తపస్సు చేసినా.. రాహుల్ గాంధీ మరో వంద జోడోయాత్రలు చేసినా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలకిందులుగా తపస్సు చేసినా.. రాహుల్ గాంధీ మరో వంద జోడోయాత్రలు చేసినా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. గత పదేళ్లు కేసీఆర్ మొక్కవోని పట్టుదలతో తెలంగాణలో అభివృద్ధి యజ్ఞం చేశారు.. అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికనే చెప్తున్నది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
