Warangalvoice

Warangal Voice

మోడీ రాకతో పెరిగిన పొలిటికల్‌ హీట్‌

  • మరోమారు పరస్పర ఆరోపణలతో వేడెక్కుతున్న రాజకీయం
  • సర్వత్రా ఇప్పుడు రాజకీయంగా ఇదే చర్చ

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పుడు బిజెపి కార్యవర్గ సమావేశాలు, మోడీ పర్యటన, ప్రసంగం,కెసిఆర్‌ వ్యవహార శైలిపైనే పెద్దగా చర్చ సాగుతోంది. ఇంతగా పరస్పరం శతృవులుగా మారిన పరిణామాలపైనా చర్చించకుంటున్నారు. అదేపనిగా కేంద్రాన్ని, మోడీని తిడుతున్న టిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడుతున్నారు. మరికొందరు సమర్థిస్తున్నారు. మోడీ తెలంగాణకు ఏం చేశారనే వారు కూడా ఉన్నారు.అయితే మోడీ మాత్రం ఇటీవలి తన పర్యటనలో అందరితో తిట్టించి.. తాను అభివృద్ది మంత్రం జపించి కేసీఆర్‌ వ్యూహానికి చిక్కని మోడీ.. తన బలగాన్ని బలిమిని ప్రదర్శించి టీఆరెస్‌ను హడలెత్తించడం లో మోడీ సక్సెస్‌ అయ్యారని కూడా అంటున్నారు. .ప్రధాని మోడీ హైదరాబాద్‌ రాకను టీఆరెస్సే అనవసరంగా హైప్‌ క్రియేట్‌ చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి.మోడీ రాక.. ఇటు టీఆరెస్‌లో అటు బీజేపీలో మాత్రం కదిలిక తెచ్చింది. బీజేపీలో కొంచెం జోష్‌ పెరిగింది. టీఆరెస్‌లో బీజేపీని పెద్దగా చూపి తమను తాము భయపెట్టుకునే పరిస్థితి ఏర్పడిరది. తమకు ప్రధాన శత్రువు బీజేపీయేనని మరీ ఢంకా బజాయించి చెప్పుకున్న కేసీఆర్‌ జాతీయరాజకీయాల్లో బలపడాలనుకున్నా అందుకు పునాది ఎలా అన్న ఆలోచనలో పడేట్లు చేసింది. మోడీ మాత్రం అభివృద్ది మంత్రం జపించి.. లోపల కోర్‌ కమిటీలో తీర్మానాల పేరుతో భవిష్యత్తు కార్యచరణ బోధించినట్లు సమాచారం. ముందు జాగ్రత్త పేరుతో నానా హంగామా చేసింది. అనవసర ఖర్చును పెట్టింది. హోర్డింగులతో హోరెత్తించింది. పేపర్లలో మొదటి పేజీ యాడ్లు కబ్జా చేసేసింది. ప్రశ్నల పేరుతో ఇరుకున పెట్టాలని చూసింది. నిలదీతలతో రెచ్చగొట్టాలని ప్రయత్నించిందని అంటున్నారు. ఆఖరికి బహిరంగ సభలో టీఆరెస్‌ను తిట్టించి. తెలంగాణ ప్రజల మద్దతను టీఆరెస్‌ కూడగట్టాలని చూసింది. అన్నీ చేసినా.. మోడీ మాత్రం అదరలేదు.. స్పందన లేదు. ప్రశ్నలకు జవాబు లేదు. ఆరోపణల అస్త్రాలూ సంధించలేదు. అందరినీ ఒక్కచోటికి తెచ్చి తన బలగాన్ని బలిమిని ప్రదర్శించి టీఆరెస్‌ను హడలెత్తించడంలో మాత్రం మోడీ సక్సెసయ్యాడని అంటున్నారు. వేదిక విూద నుంచి అందరితో కెసిఆర్‌ను, టిఆర్‌ఎస్‌ను, కుటుంబపాలనను తిట్టించాడు. కేసీఆర్‌ వ్యాఖ్యలు.. యశ్వంత్‌ సిన్హాకు టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఘన స్వాగతం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజే టీఆర్‌ఎస్‌ పోటాపోటీగా ర్యాలీ నిర్వహణ గురించి తెలిసినా.. మోడీ తన ప్రసంగంలో వాటిని ప్రస్తావించలేదు. ఇది ప్రధాని మోడీ వ్యూహాత్మక నిర్ణయమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇకపై జాతీయ రాజకీయాలే తన టార్గెట్‌ అని పదేపదే చెబుతున్న కేసీఆర్‌ గురించి మాట్లాడితే.. ఆయన స్థాయిని పెంచినట్లు అవుతుందని మోడీ భావించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ నేరుగా కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయకుండా పార్టీ అగ్రనేతలతో గులాబీ బాస్‌ కు చురకలంటిం చారన్న వాదనలు వినిపిస్తున్నారు. మోడీ స్వయంగా ఒక్క మాట అనకపోయినా.. కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ ను సీఎం చేయాలనుకుంటున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కు ఏటీఎంలా మారిందని, కేంద్ర పథకాల పేర్లు మార్చి జనాన్ని ఏమార్చుతున్నాడన్న పార్టీ అగ్రనేతల వ్యాఖ్యలతో కేసీఆర్‌ కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతిని ఎండగట్టేలా చేశాడని అంటున్నారు. ఈ క్రమంలో మోడీ స్పీచ్‌ జాతీయ రాజకీయాలపై కన్నేసిన కేసీఆర్‌కు నిరాశ తప్పదని కూడా అంటున్నారు. కేసీఆర్‌ ను విమర్శించి దేశవ్యాప్తంగా ఆయన పేరు చర్చకు వచ్చేలా చేయడం ఇష్టం లేకనే మోడీ వ్యూహాత్మకంగా తన ప్రసంగ పాఠాన్ని మార్చుకొని ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఒకవేళ విజయ సంకల్ప సభలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మోడీ కేసీఆర్‌ ను విమర్శించి ఉంటే జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగేది. జాతీయ రాజకీయాల్లో కెసిఆర్‌ ఇమేజ్‌ మరింత పెరిగేది. అందుకే టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ పేరు ఎత్తుకుండా మోడీ వారికి ఆ ఛాన్స్‌ లేకుండా చేశాడని, తిట్టకుండా సైలెంటుగా ఉండి తెలివిగా దెబ్బతీశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్‌ ఇంజన్‌ కావాలని కోరుకుంటన్నారని, ఇక్కడ బీజేపీ హవా పెరిగిందని, నమ్మకం పెంచుకుంటు న్నారని మోడీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చాడు. తెలంగాణకు ఏమేమి చేశామో ఏవో లెక్కలు చెప్పి ముగించేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *