వరంగల్ వాయిస్, కేయూ క్రైం :మోటార్ సైకిల్స్,ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని బుధవారం కేయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కే యూ ఇన్స్పెక్టర్ రవి కుమార్ వివరాలు వెల్లడిస్తూ కాకతీయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం ఉదయం కేయూ ఎస్సై పి. శ్రీకాంత్ సిబ్బంది తో కలిసి ఎర్రగట్టుగుట్ట క్రాస్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి హాసన్ పర్తి వైపు నుండి మోటార్ సైకిల్ పై వస్తుండగా అతన్ని అపమని చెప్పడంతో ఆపకుండా వెళ్తుండగా అనుమానంతో వెంబడించి పట్టుకొని అతన్ని ఎందుకు పారిపోతున్నావని ప్రశ్నించగా అతను తడబడుతూ ఉండగా అతని బండిని చెక్ చేయగా అందులో కొంత బంగారం దొరికిందని తెలిపారు.అతన్ని పూర్తిగా విచారించగా తన పేరు గోవిందుల కుమారస్వామి, తండ్రి పేరు పోశాలు, వయస్సు 45 సంవత్సరాలు, కులం కురుమ, వృత్తి కూలీ, ఇప్పలనర్సింగాపూర్, హుజూరాబాద్ అని తెలిపి తాను చేసిన దొంగతనాలు అన్నీ ఒప్పుకున్నాడని అతడు గతంలో చాలా పోలీస్ స్టేషన్ ల పరిధిలో దొంగతనాలు చేసినానని, గత 5 నెలల నుండి కేయూ, హాసన్పర్తి, ఎల్కతుర్తి, వంగర,వేలేరు, కాజీపేట పోలీస్ స్టేషన్ ల పరిదిలో దొంగతనాలు చేసినానని ఒప్పుకున్నాడని తెలిపారు. అతని నుంచి 2- మోటార్ సైకిల్స్, 4.5 తులాల బంగారంను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.