Warangalvoice

Mogina Karnataka Election City

మోగిన కర్నాటక ఎన్నికల నగారా

  • మే 10న ఒకే దశలో ఎన్నికల నిర్వహణ
  • మే 13న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాల ప్రకటన
  • ఏప్రిల్‌ 13వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల
  • ఏప్రిల్‌ 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు
  • 80 ఏళ్ల పైబడ్డవారికి, వికాలంగులకు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌
  • విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన సిఇసి రాజీవ్‌ కుమార్‌
    వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌ ప్లీనరీ హాలులో బుధవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు.ఏప్రిల్‌ 13వతేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ ను విడుదల చేస్తామని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. కర్నాటక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా ’ఓటు ఫ్రమ్‌ హోం’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ’ఓటు ఫ్రమ్‌ హోం’ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడిరచారు. కర్ణాటక శాసనసభ గడువు మే 25వ తేదీతో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్‌ 13వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్‌ 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మేజిక్‌ ఫిగర్‌ 113 గాఉంది. 2018 ఎన్నికల్లో బీజేపీ 104, కాంగ్రెస్‌ 80, జెడిఎస్‌ 37 స్థానాలలో గెలుపొందింది. మధ్యలో జరిగిన ఉప ఎన్నికలతో బీజేపీ బలం 119 స్థానాలకు పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌ కు 75 ఎమ్మెల్యేలు, జేడీఎస్‌ 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్నాటక రాష్ట్రంలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు రిజర్వ్‌ చేయబడ్డాయి. ఈ క్రమంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఇసి రాజీవ్‌ కుమార్‌ మే 10వ తేదీన పోలింగ్‌ నిర్వహించి మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు కూడా ప్రకటించారు. మొత్తం 5. 21 కోట్ల మంది ఓటర్లకు గాను మొత్తం 58, 282 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిరచారు. 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు ఉండగా ఓటు హక్కు పొందిన 41,312 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నట్లు గుర్తించారు. 80ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే చాన్స్‌ తీసుకొచ్చారు. దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా 13 వందలకు పైగా పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల్లో ధన ప్రలోభాలను నివారించేందుకు స్పెషల్‌ టీమ్‌ లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Mogina Karnataka Election City
Mogina Karnataka Election City

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *