- 9నుంచి 16వరకు
- 200 బస్సులు..400 ట్రిప్పులు
- వరంగల్ రీజియన్ రీజినల్ మేనేజర్ విజయ భాను
వరంగల్ వాయిస్, వరంగల్ : మినీ మేడారం జాతర సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ డి.విజయ భాను ప్రకటించారు. ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎనిమిది రోజుల పాటు 200 బస్సులు..400 ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి మేడారానికి ఉదయం 6 గంటల నుంచి భక్తుల బస్సులను నడపనున్నట్లు తెలిపారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనం చేసుకునే భక్తులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. మహిళలు, ఆడపిల్లలు వారి ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా ప్రయాణం చేసి అమ్మవార్లను దర్శనం చేసుకోవచ్చన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవల కొరకు హనుమకొండ బస్ స్టేషన్ తోపాటు మేడారంలో ప్రతిరోజు ఇద్దరు కంట్రోలర్లతోపాటు ఒక డిపో మేనేజర్ ఈ ప్రత్యేక బస్సుల ఆపరేషన్ ను పర్యవేక్షిస్తారన్నారు. హనుమకొండ నుంచి ఈ ప్రత్యేక బస్సులు 24 గంటలు ప్రయాణికుల రద్దీని బట్టి నడపుతామన్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ఆర్థికంగా నష్టపోకుండా ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని విజయ భాను కోరారు. ఇతర వివరాలకు ఆర్టీసీ బస్ స్టేషన్ ఎంక్వయిరీ నెంబర్ 9959226056 లో సంప్రదించాలన్నారు. బస్సు ట్రిప్పుల వివరాలను రీజినల్ మేనేజర్ డి.విజయ భాను వెల్లడించారు. 9వ తేదీ ఆదివారం 15 ట్రిప్పులు, 10, 11వ తేదీల్లో 10, 12వ తేదీ బుధవారం 20, 13వ తేదీ గురువారం 25, 14వ తేదీ శుక్రవారం 50, 15వ తేదీ శనివారం 20, 16వ తేదీ ఆదివారం 50 ట్రిప్పులను భక్తుల సహాయార్థం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.