వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కోన్ రెడ్డి ఆయిల్ రెడ్డి (85) బుధవారం అనారోగ్యంతో మరణించగా వారి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, భార్య ఉపేంద్ర, కుటుంబ సభ్యులు సమాజ హితం కోరి పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లో పార్థివ దేహాన్ని, పాకాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, అనాటమీ విభాగం ప్రొఫెసర్, సిబ్బంది ప్రేమ్ కుమార్ కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోన్ రెడ్డి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, డి.రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కే.శంకర్రావు యాదవ్, సలహాదారు డాక్టర్ రాజేంద్రప్రసాద్, కార్యనిర్వాక సభ్యులు అనంతుల కేదారి, రామచందర్, మనోహర్, చల్ల వెంకట్రెడ్డి, వీరస్వామి తదితర సామాజిక వాదులు పాల్గొన్నారు.
