- జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఘటన
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : ఓ మహిళ తన ఇంటి ముందు మనువడిని అడిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి పుస్తెల తాడు, ఇతర బంగారు గొలుసును అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. కృష్ణ కాలనీ చెందిన మంగళంపల్లి సోమలక్ష్మి తన మనువడిని ఇంటి ముందు ఆడిగిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి నాలుగున్నర తులాల బంగారు పుస్తేల తాడు, బంగారు గొలుసు అపహరించుక పోయాడు. మహిళ, దుండగుడి మధ్య జరిగిన పెనుగులాటలో అర తులం వరకు గొలుసు ఆమె చేతిలోకి రాగా మిగిళిన 4.5 తులాలు బంగారు ఆభరణాలు అపహరించుకు పోయాడు. పెనుగులాటలో మెడపై స్వల్ప గాయాలయ్యాయి. నిత్యం జన సంచారం అధికంగా ఉండే కృష్ణ కాలనీలో దుండగుడు మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు అపహరించకపోవడం సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడి అచూకీ కోసం కాలానీలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, రాత్రివేళ పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.