వరంగల్ వాయిస్, మడికొండ : దక్షిణ కాశీగా ప్రసిద్ది గాంచిన శ్రీ మెట్టుగుట్టపై నున్న శ్రీ సీతా రామచంద్ర స్వామి, శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రామనవమి బ్రమ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10:30గంటల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట శాసన సభ్యులు కెఆర్ నాగరాజు, జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుహాసిని హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని కల్యాణాన్ని తిలకించారు. 18వ తేదీ గురువారం ఉదయం హోమం, బలిహరణ వసంతోత్సవం, సాయంత్రం 6 గంటలకు నిత్యా హోమం, బలిహరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శేషు భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పరాశరం విష్ణువర్ధనాచార్యులు, రాగిచేడు అభిలాష్ శర్మ, పారుపల్లి సత్యనారాయణ శర్మ, ధర్మకర్తలు బైరి రాజు, వస్కుల ఉమ, దండిగం శ్రీనివాస్, రొడ్డ దయాకర్, బోగి కేదారి, మాడిశెట్టి జ్ఞానేశ్వరి, 46 డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, 64 డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికా రెడ్డి, ఆలయ సిబ్బంది, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.