వరంగల్ వాయిస్, ములుగు: ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం వారి అరెస్ట్ ను చూపిన వెంకటాపురం సీఐ కె. శివప్రసాద్ మంగళవారం వివరాలు వెల్లడిరచారు. 25న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటాపురం మండలం కొండాపురం గ్రామ శివారులోని బిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కొండాపురం వైపు నుంచి అలుబాక వైపునకు అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ బ్రిడ్జి సమీపానికి వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడిరచి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నిషేదిత సి.పి.ఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) , జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పేరుతో నినాదాలతో కూడిన కొన్ని కరపత్రాలు కనిపించాయమన్నారు. పట్టుబడిన వ్యక్తులు తాటి సోమయ్య, తాటి సత్యం, యాలం సురేష్ ల గుర్తించారు. వీరిది వెంకటాపురం మండలం కొండాపురం గ్రామమని చెప్పారు. వీరు మావోయిస్టు మీటింగులకు, పాటలకు, ప్రసంగాలకు ఆకర్షితులై 2018 సంవత్సరంలో సానుభూతిపరులుగా చేరి, వారికి కావల్సిన నిత్యవసర వస్తువులు, భోజనం, వసతి వారి ఇళ్లలో కల్పించేవారన్నారు. ఈ క్రమంలోనే నిషేధిత సి.పి.ఐ మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులతో కలిసి వెంకటాపురం, చర్ల, తాడ్వాయి పరిధిలో పలురకాల చట్ట వ్యతిరేక చర్యలలో పాల్గొన్నారన్నారు. ఈ నెల 28 వ తేదీ నుంచి ఆగస్టు 3 వ తేదీ వరకు నిర్వహించే మావోయిస్ట్ పార్టీ అమరవీరుల వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు కొండాపురం బ్రిడ్జి దగ్గర వేసేందుకు రాగా పట్టుబడ్డారని వెల్లడిరచారు. కర పత్రాలను స్వాధీనపరుచుకొని వారిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్సైలు జి.తిరుపతి, ఆర్. అశోక్, సివిల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
