బ్రాట్ నాన్ ఇంగ్లీష్ అవార్డుల కేటగిరీలో చోటు
ఆర్‌ఆర్‌ఆర్ అదరగొడుతూ..అవార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులకు షార్ట్‌లిస్టు అయిన ఆర్‌ఆర్‌ఆర్ ఫిల్మ్.. ఇప్పుడు మరో ప్రతిష్టాతక అవార్డు కోసం కుస్తీపడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రిలీజైన ఈ ఫిల్మ్.. తాజాగా బ్రాట్ ( బ్రిటీష్ అకాడవిూ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరింది. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలు ఈ విషయాన్ని తమ ట్విట్టర్‌లో తెలిపారు. బ్రాటా లాంగ్‌లిస్టులో ఆర్‌ఆర్‌ఆర్‌కు చోటు దక్కడం సంతోషకరమని, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆ చిత్ర నిర్మాతలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిరచారు. బాఎª`టాలో తొలుత లాంగ్ లిస్టును ప్రకటిస్తారు. ఆ తర్వాత నామినేషన్లను, ఆ తర్వాత ఓవరాల్ విన్నర్‌ను వెల్లడిస్తారు. అయితే బాఎª`టా నామినేషన్లను జనవరి 19వ తేదీన ప్రకటించనున్నారు. ఇక అవార్డులను ఫిబ్రవరి 19వ తేదీన ప్రకటిస్తారు. బాఎª`టా నాన్ ఇంగ్లీష్ లాంగ్‌లిస్ట్ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్టన్ర్ ఫ్రంట్, అª`జ్గంªంటీనా, 1985, బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రుత్స్, క్లోజ్, కోర్సేజ్, డిసిజన్ టు లీవ్, ఈవో, హోలీ స్పైడర్, ద క్వయిట్ గర్ల్ పోటీపడుతున్నాయి. బాఎª`టా లాంగ్ లిస్టుకు 10 చిత్రాలను ఎంపిక చేశారు. దీంట్లో చివరకు 5 సినిమాలను అవార్డుకు నామినేట్ చేస్తారు. ఆ తర్వాత విన్నర్‌ను ప్రకటిస్తారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లు వసూలు చేసింది. గోª`డలెన్ గ్లోబ్‌తో పాటు ఆస్కార్స్ రేసులోనూ ఈ ఫిల్మ్ పోటీపడుతోంది. జనవరి 11వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి రామ్, ఎన్జీఆర్ హాజరుకానున్నారు. గోల్డెన్ గ్లోబ్‌లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌తో పాటు నాటు నాటు సాంగ్‌కు మ్యూజిక్ క్యాటగిరీలో పోటీపడుతోంది. ఇక ఆస్కార్స్‌లో నాటు నాటు సాంగ్ రేసులో ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ షార్ట్‌లిస్టులో ఆర్‌ఆర్‌ఆర్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.
