- ముచ్చింతల్‌లో పదిరోజుల పాటు ఉత్సవాలు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ వద్ద ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ గతేడాది వైభవంగా సాగింది. అదే స్ఫూర్తితో చినజీయర్ స్వామి ఇప్పుడు వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇది దేశానికి,ప్రంపచానికి, మనకూ గర్వకారణం. దాదాపు పదిరోజుల పాటు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగనుంది. ఫిబ్రవరి 2 గగురువారం నుంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఏడాది కాలంగా సమతామూర్తి ప్రాంతం ఇప్పుడు ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో రామనుజాచార్యుల వారిది ఖచ్చితంగా ప్రత్యేక స్థానమే. వెయ్యేళ్ల క్రితం అంటే… దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన రామానుజాచార్యులు.. వాళ్లను అర్చకులుగానూ మార్చారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. నారాణమంత్రాన్ని అందరికీ బహిరంగగంగా ఉపదేశించారు. ఆయన ఆనాడు వేళ్లూనుకున్న వర్ణవ్యవస్థలో ఓ విప్లవం తీసుకుని వచ్చారు. పేదల ఇళ్లల్లో, దేవాలయాల్లో పూజారులుగా ఏర్పాటు చేసి గౌరవించారు.
