- రాష్టాల్ల్రోనూ ధర్నాలు చేసేలా కార్యాచరణ
- చర్చలు, రౌండ్ టేబుల సమావేశాలకు నిర్ణయం
- సామాజిక మాధ్యమాల్లో పోస్టర్ విడుదల చేసిన కవిత
వరంగల్ వాయిస్,హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దానిని మరింత ఉధృతం చేయనున్నారు. ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా నిర్వహించి దేశ ప్రజల దృష్టిని ఆకర్శించారు. ఆ తరవాత మరోమారు సమస్యను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించారు.
అయితే ఇడి దర్యాప్తులో భాగంగా కొంత అంతరాయం ఏర్పడిరది. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో కవిత ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు అంటూ పోస్టర్లో పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు.. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహిళా బిల్లు ఉద్యమ కార్యచరణను కవిత ప్రకటించారు.చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం విస్మరించిన నేపథ్యంలో ఆందోళనను మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భారత జాగృతి సంస్థ కార్యాచరణను సిద్దం చేస్తోంది. అవసరమైతే రాష్టాల్ర వారీగా ఆందోళనలకు సిద్దం అవుతున్నారు.
