- కాంగ్రెస్ ఎంపి రాహుల్‌పై అనర్హత వేటు
- లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసిన
- తక్షణమే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్
- వయొనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: భారతీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే భారత్ జోడోయాత్రతో ప్రజల ముందుకు వచ్చిన రాహుల్ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిరది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యుడిగా అనర్హత పొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై.. లోక్‌సభ సెక్రటేరియేట్ అనర్హత వేటు విధించింది. లోక్‌సభ నుంచి ఆయన్ను డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు అయ్యింది. మార్చి 23వ తేదీ నుంచి అనర్హత వేటు అమలులోకి వస్తుందని లోక్‌సభ సెక్రటేరియేట్ తెలిపింది. ప్రధాని మోదీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. నేరపూరిత పరువునష్టంకేసులో దోషిగా తేలినందు వల్లే రాహుల్‌కు అనర్హత తప్పలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ తన లేఖలో పేర్కొంది. దీంతో రాహుల్ గాంధీ 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం రాహుల్ కేరళలోని వయొనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్‌సభ ఈ నిర్ణయం తీసుకుంది. జైలశిక్ష కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. 2019 కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడీని కించపర్చే విధంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ.. సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు… రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. అయితే కోర్టు మాత్రం రాహుల్ గాంధీని దోషిగా తేల్చి..రెండేళ్లు జైలు శిక్ష విధించింది. రూ.15 వేల అపరాధం కూడా విధించింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడిరది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్టేట్ర్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడిరది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(।) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం‘ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు. ఈ కేసులో సూరత్ కోర్ట్ ప్రస్తుతానికి కోర్టు 30 రోజుల బెయిల్ ఇచ్చినా తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. అయితే సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.