- ఆర్థిక సంక్షోభల నేపథ్యంలో మన బడ్జెట్ ఆశాకిరణం
- అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్దం
- సమావేశాల్లో ఆరోగ్యకరమైనచర్చకు స్వాగతం
- పార్లమెంట్ వద్ద విూడియాతో ప్రధాని మోడీ
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో అందరి దృష్టి భారతదేశ బడ్జెట్‌పై ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక సంక్షోభం వేళ మన బ్జడెట్ ప్రపంచానికే ఆశాకిరణమని అన్నారు. పౌరుల ఆశలు, ఆకాంక్షలు తీర్చేందుకు యత్నిస్తున్నమాని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగం చేయనున్నారు.పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ వద్ద ప్రధాని మోడీ మాడియాతో మాట్లాడారు. భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ’ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం’ అని అన్నారు. పార్లమెంటులో నూతన సభ్యుడు ఎవరైనా మాట్లాడాలనుకుంటే వారిని ప్రోత్సహిస్తుందన్నారు. దేశ ఆర్ధికమంత్రి కూడా మహిళ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుందన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెటట్ రూపొందించారని భావిస్తున్నానని చెప్పారు. ’ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్’ అనే కాన్సెప్ట్ ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. విపక్ష సభ్యులు అన్ని అంశాలపై పార్లమెంట్ లో లేవనెత్తెందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశాభివృద్ధికి ఇదే కీలక సమయమని, దేశ ఆర్థిక పురోగతి వంటి అంశాల్లో ప్రపంచానికి భారత్‌పై మరింత విశ్వాసం పెంపొందించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వేదిక కావాలని ప్రధాని మోడీ అభిలషించారు. వీటన్నింటిపై హృదయపూర్వకంగా చర్చించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు విూడియాతో ప్రధాని మాట్లాడుతూ, సమావేశాలకు ఎంపీలకు స్వాగతం పలుకుతున్నామని, నేటి ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో గొప్పగొప్ప అవకాశాలు ఉన్నాయని, దేశాభివృద్ధికి కీలకమైన సమయంలో అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చర్చలు ఫలప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలని అన్నారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుతుందని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ప్రపంచానికి భరోసా ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమావేశాలు.. దేశ ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు ఉపయోగపడ తాయని అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. భారత్‌కు అనేక అవకాశాలు పొంచి ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత సమావేశంలో రాజకీయ పార్టీలన్నీ నాణ్యమైన చర్చకు సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీలు సమగ్రమైన చర్చలు జరిగేలా చూస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఎన్నికల ప్రభావం ఈ సమావేశాలపై, చర్చలపై ఉంటుందనేది నిజమే. ఎన్నికలు నడుస్తూనే ఉంటాయి. కానీ బడ్జెట్ అనేది ఏడాది మొత్తానికి మార్గనిర్దేశం అందిస్తుంది. ఈ సమావేశాలు ఎంత ఫలప్రదమైతే.. ఈ ఏడాది దేశం ఆర్థికంగా పురోగమిం చేందుకు అన్ని అవకాశాలు లభిస్తాయన్నారు.
