- అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న
వరంగల్ వాయిస్, కల్చరల్ : అంబేద్కర్ అంటే అందరికి అర్థమయ్యేది ఆయన అంటరాని కులంలో పుట్టాడని, కాదంటే దళిత నాయకుడు అని అయితే ఈ దేశానికి రాజ్యాంగం రాసినాయన రాజ్యాంగ నిర్మాతగా పరిచయం అవుతాడు. మరి కొంత మందికి సామాజిక విప్లవకారుడుగా కనిపిస్తాడు. ఇంకొంత మందికి సాంఘీక సంస్కర్తగా కనిపిస్తాడు. వేరే వారికి ఒక న్యాయవాదిగా న్యాయశాఖ మంత్రిగా కనిపిస్తే మరికొంత మందికి మంచి రచయితగా కనిపిస్తాడు. భారతదేశంలోని సామాజిక ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవటానికి కావలసిన పరిశోధనలు చేశాడు. పరిశోధనాసార పుస్తకాలుగా రాశాడు. ఆయన ఎంచుకున్న పరిశోధనలు కూడా చాలా క్లిష్టమైనవి. అంటరానితనం అంటే ఏమిటి? వారు అంటరాని వారు ఎలా అయ్యారు? అనేవి. శూద్రులెవరు? అనేవి? శుద్రులెవరు? కుల నిర్మూలన అంశాల మీద పుస్తకాలు రాశాడాయన. భారతదేశంలోని రచయితలు సామాజిక శాస్త్రవేత్తలు ‘కులం’ గురించి పరిశోధనలు చేయలేదు. పుస్తకాలు రాయలేదు. కులం పుట్టుపూర్వోత్తరాల గురించి పాశ్చాత్యులు పరిశోధన చేసి పుస్తకాలు రాశారు తప్ప భారతీయులు మంత్రం ఎక్కువ మంది కృషి చేయలేదు. అందులో అంటరాని తనం గురించి ఆలోచించిన వారే లేరు. అంటరాని తనం ఎలా వచ్చింది. ఎప్పుడోచ్చింది? అని పరిశీలించిన వారే లేరు. అదేదో సహజమైన విషయంగా అందులో పరిశీలించవలసిన విషయమేమి లేనట్లుగానే పరిశోధకులు ప్రవర్తించారు. డాక్టర్ అంబేద్కర్ ఒక్కడే అంటరాని తనం గురించి పరిశోధన చేసి దాని మూలంలోకి వెళ్లి దాని కాలాన్ని నిర్ణయించాడు. అదే విధంగా కులవ్యవస్థకు వ్యతిరేకంగా అంటరాని తనం నిర్మూలనకు మహాత్మజ్యోతిరావు పూలే అద్బుతమైన కృషి చేశాడు. ఆయన ఒక్కడే ఆయనది ఒంటరి పోరాటమే. దాని నుంచి స్ఫూర్తిని తీసుకొని డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం కృషి చేశాడు. దానికి కొంచెం ముందుకెళ్లి శాస్త్రీయమైన చరిత్రకమైన ఆధారాలు తీశాడు. కుల వ్యవస్థ అంటరాని తనం రెండు విషయాలను పరిశీలించేప్పుడు మనకు ఇద్దరు వ్యక్తులు గుర్తుకు వస్తారు. ఒకరు గాంధీజీ, మరొకరు అంబేద్కర్. ఈ విషయంపై వీరిద్దరిలో చాలా ప్రధానమైన తేడా ఉన్నది. అంటరాని తనానికి మూలం కుల వ్యవస్థ అన్నాడు అంబేద్కర్. అంటరాని తనం పోవాలంటే కుల వ్యవస్థ కూలిపోవాలి అన్నాడాయన. గాంధీజీ అలాకాకుండా అంటరాని తనం వేరు, కులం వేరు అన్నాడు. అంటరాని తనం పోవాలి కాని కులం మాత్రం ఉండాలన్నాడు గాంధీజీ. ఇది వీరిద్దరికి ఉన్న తేడా అంబేద్కర్ అలాకాదు కుల వ్యవస్థ చాలా హానికరమైనది అన్నాడు. మనుషులు ఒకరినొకరు కలవకుండా చీల్చి వేస్తున్నది. మానవత్వాన్ని హానికరమైనది భారతీయులంతా ఒకే జాతిగా ఆవిర్భవించడానికి పరిణతి చెందటానికి అడ్డం వస్తున్నది అంటాడాయన. కుల వ్యవస్థలో కేవలం కులాలు డటమే కాదు. అందులో హెచ్చుతగ్గులున్నాయి. చ్చనీచభావాలున్నాయి. పైకి వెళ్లె కొలది పూజ్య భావం కిందికి వచ్చే కొలది అసహ్య భావం కల్గిస్తుంది అన్నాడు. అంబేద్కర్ ఈనిచ్చెననట్లు వ్యవస్థ నిలువునా సమాజాన్ని చీల్చింది అంటాడు.
హిందూ సమాజంలో సమాజంలో సమానత్వం కోసం కృషి చేసినత మహాపురుషులలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకరు. ఇందు కోసం హిందూ సమాజంలో సంస్కరణలను తెచ్చి సమైక్యతను నిర్మాణం చేయాలని అంబేద్కర్ భావించేవారు. మొదట్లో మతం మారాలన్న ఆలోచన ఆయనకు లేదు. శూద్రులు, అస్పృశ్యులు, వేదాలు చదువరాదని వినరాదని కవేళ చదివితే వారి నాలుకలను కోయాలని, వింటే చెవుల్లో సీసం పోయాలని మనుస్మృతి చెప్పిన మాటలను తీవ్రంగా ఖండించారు. 1927 డిసెంబర్ 25న మనుస్మృతి ప్రతులను బహిరంగంగా తగులబెట్టారు. గత కాలపు మౌఢ్యాలపై ఇలా బాహాటంగా తిరుగుబాటు చేసిన వాడు ఆనాటికీ, ఈనాటికీ అంబేద్కర్ ఒక్కడే.త 199 బ్రిటిష్ ఇండియా చట్టం ప్రకారం శాసనసభలలో భారత రాజ్యాంగ చట్టాన్ని సవరించాలి. ఇందుకోసం ఏడుగురు తెల్లవాళ్ళతోత ఏర్పాటైన సైమన్ కమిషన్1928 ఫిబ్రవరి 3న భారత్‌ను దర్శించింది. తమ సభ్యులెవరు సైమన్ కమిషన్‌లో సభ్యులు కానందున వీరి పర్యటనను కాంగ్రెస్ వ్యతిరేకించింది.సైమన్ కమిషన్‌కు అంబేద్కర్త సహకిరంచేందుకు ముంబాయి రాష్ట్ర సలహా సంఘం ఆమోదం తెలిపింది. దీనిపై విరుచుకు పడిన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్‌ను ద్రోహి అన్నారు. అస్పృశ్యుల స్థితిగతులపై సుదీర్ఘ విజ్ఞాపన పత్రాన్ని అంబేద్కర్ సైమన్ సమర్పించారు. ముంబాయి శాసన మండలిలో 149 స్థానాల్లో నిమ్మ జాతుల వారికి వారి దామాషాను బట్టి కేటాయించాలని విన్నవించారు. తరతరాల నుంచి అస్పృశ్యులు అణగారిన వర్గాల వారిని వీరిని హైందవ మతంలో సంబంధం లేని జాతులుగా గుర్తించి వారి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సైమన్‌ను కోరారు. దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నంత వరకు అస్పృశ్యులుగా చాలా మంది అవుతున్న వారికి జరుగుతున్న అన్యాయాలు అంతం కావని 1930 నాటి తొలి రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ ప్రకటించారు. అందువల్ల భారతదేశంలోని అస్పృశ్యులు సైతం బ్రిటిష్ పెత్తనం తొలగిపోవాలనీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుతున్నారని అన్నారు.
ఒక సందర్భంలో హిందూ మతంపై తన అభిప్రాయం వెల్లడిస్తూ హిందువులలో కులాలున్నట్లే హైందవేతరులలో వర్గాలున్నప్పటికీ హిందువలలో వర్ణాలకున్న స్థతి హైందవేతరులలో లేదు. ముస్లింను నీవెవరు అని అడగండి? నేను ముస్లింను అని జవాబు చెబుతాడు. ముస్లిం అనో సిక్కు అనో చెబుతారు. ముస్లింలోనూ సిక్కులలోను శాఖా బేధాలున్నప్పటికీ వారు చెప్పరు. ఒక ముస్లిం తను ముస్లిం అని చెప్పిన తర్వాత నువ్వు షియా, సున్నీ, షేక్, సయ్యద్, ఖటిక్, పింజారి, శాఖలలో దీనికి చెందిన వాడిని అని అడగం కానీ, క హిందువును నేను హిందువునని చెబితే మనం తృప్తిపడం. అతని కులం ఏదో అని అడిగేస్తారు. ఎందుకంటే హిందువులలో కులానికి అంత ప్రాధాన్యం ఉన్నది కాబట్టి. కులం తెలిస్తేనే ఆ వ్యక్తి ఎవరు? ఎలాంటి వాడు అన్న వివరం తెలియదు కాబట్టి హిందువులలో ఉండే కులాలకు తక్కువ మతాలలో ఉండే శఆఖ బేధాలకు తేడా స్పష్టంగా తెలియాలంటే వారు ఈ కులాలను శాఖలను ధిక్కరించి నపుడు వచ్చే పర్యవసానాన్ని బట్టి గమనించాలి. సిక్కులలోను, మహ్మదీయులలోను, క్రైస్తవులలోను సాంఘీక బహిష్కారం అనే మాటే లేదు కానీ హిందువులలో కులానికి హైందవేతరులలో శాఖలకు వాటి నిర్మాణంలో ఎంతతేడా ఉన్నదో తెలుసుకోవడానికి ఇంతకంటె నిదర్శనం ఏముంటుంది? హిందువులకు హైందవేతరులకు మధ్య గల ముఖ్య తేడాలను చూపడంలో ఇది రెండవ అంశం, మూడవది శాఖా బేధం హైందవేతరులలో శఆఖ విభజన అనేది క అభ్యాసం మాత్రమే దానిని వారు మతపరంగా నిర్దేశిస్తుంది. హైందవేతరులలో అలాంటి మత బేధం లేదు. హైందవేతరులలోని శాఖ బేధాలు మొత్తం సమాజ భావానికి లోబడినట్టివి. హిందువలలోని కులాలు మాత్రం సమాజ భావాలను విచ్చిన్నం చేసే అవరోధాలు హిందువులలో కులాలు హైందవేతరులలో శాఖలు కటే అనే భ్రమను హిందువులలో ఎంత త్వరగా తలగించుకుంటే అంతమంది హిందూ మతానికి ఒకే ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించాలని అంబేద్కర్ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారికి రాజకీయ ప్రాతినిద్యం కోసం ఆయన పోరాడారు. షెడ్యూల్డ్ కులాలు తెగలకు రిజర్వ్డ నియోజకవర్గాల ఏర్పాటుఆయన పుణ్యమే. ప్రత్యేక నియోజకవర్గాల కోసం పోరాడి 1932లో పూణే ఒప్పందాన్ని చేసుకున్న రాజకీయ దురంధరుడు 1933లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై బలహీన వర్గాల వారికి వినిపించిన ఆదర్శ రాజనీతిజ్ఞుడు కులం పునాదుల మీద క జాతి నీతిని నిర్మంచలేమని ఆనాడే స్పష్టం చేసిన జాతీయ నాయకుడు. రాజకీయ విప్లవానికి ముందు సామాజిక విప్లవం రావాలన్నది అంబేద్కర్ సోషల్ ఫిలాసఫికి మూలం అహింసాయుత సామాజిక విప్లవం అనే లక్ష్యానికి సైద్దాంతిక రూపకల్పన చేసి దేశ ప్రజల ముందు ఆవిష్కరించిన ఘనత అంబేద్కర్ దే. తరతరాలుగా సమాజంలోని అంటరాని వారిగా ఉన్న అట్టడుగు వర్గాలను సంఘటిత పరిచి ఒకే వర్గంగా నిలబెట్టిన ఖ్యాతి కూడా ఆయనదే. అట్టడుగు వర్గాలంతా హిందువలే అయితే వారు హిందూ సమాజ పరిధికి సుదూరంగా నివసిస్తున్నారు.
బాహ్యలుగా జీవిస్తున్న వారందరినీ ప్రధాన సమాజంలో అంతర్లీనం చేయడమే అంబేద్కర్ ప్రధానాశయం. మానవజాతిని దోపిడి నుంచి విముక్తం చేయడమే బౌద్ధం ప్రధాన లఓయం. అటువంటప్పుడు హింసలేని కమ్యూనిజమే బౌద్ధమని ఆయన స్పష్టం చేశాడు. బౌద్దానికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకో గలిగిన శక్తి ఉంది. అందుకే ఆయన హిందూ మతానికి ప్రత్యమ్నాయంగా బౌద్దాన్ని ఆవిష్కరించాడు. మొదట్లో మతం మారాలన్న ఆలోచనాయనకు లేదు. బుద్దుడు వెలువరించి ధర్మపురం గురించి అధ్యయనం చేయడంలో చాలా సమయం గడిపి చివరకు తన నిర్ణయాలను తను తీసుకున్నట్లు అంబేద్కర్ స్వయంగా పేర్కొన్నారు. బౌద్ధమాతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు తన భావాలని బాబా సాహెబ్ ఇలా వ్యక్త పరిచాడు. గాంధీజీతో తనకెన్ని బేధాభిప్రాయాలున్న నేను నా దేశానికి అతి తకుకవ కీడు చేసి దారినే ఎన్నుకుంటానని ఆయనతో చెప్పాను. అందుకే బౌద్ధమతాన్ని ఎన్నుకున్నాను. బౌద్ధమతం భారతీయ సంస్కృతిలో అంతర్భాగమే. నా నిర్ణయం ద్వారా ఈ దేశానికి పరంపరకు ఎటువంటి కీడు జరుగబోదన్న విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకున్నాను. దేశ సంస్కృతి విద్వాంసుల జాబితాలో నా పేరు ఎక్కడం నాకు ఇష్టం లేదు అన్న మహావ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్. ఆనాటి-ఏనాటి దురాచారాలనయినా నిరసించాలి, మార్చాలి. కాని ఈనాటి దృష్టితో ఆనాటిని చూడడం సరికాదు. ఆనాటి పరిస్థితుల్లో అవి ఏర్పడటాన్ని సామాజిక శాస్త్రజ్ఞులు పరిశీలించాలి. గతం సాంతం దుష్టత్వం అనడం సమంజసం కాదు ఎంచేతంటే మనం గతానికి వారసులం.

కొలునుపాక కుమారస్వామి, వరంగల్
మొబైల్: 9963720669