వరంగల్ వాయిస్, పరకాల : పట్టణం నడిబొడ్డులోని కూరగాయల మార్కెట్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అతి భారీ భవనం నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పురపాలక అధికారులు కళ్లు మూసుకొని ఉండటం విశేషం. కారణం మామూళ్ల మత్తా? అధికార పార్టీ ఒత్తిడులా? అని ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతోంది. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పరకాల బీజేపీ ఆధ్వర్యంలో పోరాటానికి చేయడానికి సమాయత్తం అవుతోంది. పరకాల పురపాలక సంఘం పరిధిలో జి ప్లస్ టు నిర్మాణాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అలాంటిది జీ ప్లస్ ప్లోర్ నిర్మాణం, ప్రమాదకరంగా సెల్లార్ నిర్మాణం జరుగుతున్న కూడా అధికారులకు ఇంత నిర్లక్ష్యమా అని పరకాల మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
