- రాజకీయ చైతన్యంకై గ్రామాలకు తరలాలి
- స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్ల గెలుపుకై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కృషి
- బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు
వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సమాజ విముక్తి కోసం రాజ్యాధికారం అవసరమని, రాజకీయ చైతన్యం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని బీసీ ఇంటలెక్టువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా “స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల పాత్ర” అనే అంశంపై హనుమకొండ జిల్లా కేంద్రం హరిత కాకతీయ హోటల్ లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కోసం ఉద్యమిస్తున్న బీసీలు దోపిడీ ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలను వీడాలని పిలుపునిచ్చారు. బీసీల ఓట్లు బీసీలు వేసుకోవాలని పిలుపునిస్తున్న ఉద్యమకారులు, మేధావులు కలిసి బీసీ నాయకత్వంలో ప్రత్యేక పార్టీ తీసుకురావాలన్నారు. స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు దాటినంకా కూడా బీసీ జనగణన కోసం పోరాటాలు చేయడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో కుల జనగణన జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని, ఆ హామీ అమలయ్యే వరకు పోరాటం చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ అభ్యర్థుల విజయం కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు చైతన్య సదస్సులు నిర్వహిస్తారన్నారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లను బీసీలు గెలవడమే లక్ష్యంగా బీసీ ఇంటలెక్టువల్ ఫోరం కృషి చేస్తుందన్నారు.
పల్లెలో గెలిస్తేనే.. ఢిల్లీని గెలవచ్చ..
పల్లెలో గెలిస్తేనే ఢిల్లీనీ గెలవచ్చని అప్పుడే రాజ్యాధికారం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఓబీసీజాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ బీసీ శక్తిని రాజకీయ శక్తిగా మార్చినప్పుడే రాజ్యాధికారం సాధ్యమని చెప్పారు. బీసీ చైతన్యం కోసం ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణలో 400 కిలోమీటర్ల పాదయాత్ర చేశామని, ప్రజలను చైతన్యం చేసి ఐక్యత చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న ఆల్ ఇండియా ఓబీసీ జాక్ బహుజన రాఙ్యా వచ్చే వరకు విశ్రమించదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ కన్వీనర్ గొల్లపెల్లి వీరస్వామి మాట్లాడుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన కర్పూరి ఠాకూర్ చాలా సాధారణమైన జీవనం గడిపాడని, తన జీవితమంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, కర్పూరి ఠాకూర్ లాంటి మహనీయుల స్ఫూర్తితో బహుజన రాజ్యాధికారం కోసం బి.సి సమాజం ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి స్వాగత వచనాలు డాక్టర్ కొంగ వీరాస్వామి పలుకగా ప్రొఫెసర్లు కూరపాటి వెంకటనారాయణ, దినేష్, విజయ్ బాబు, దిగంబర్ రావు, మాజీ కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, డాక్టర్ కొలిపాక శ్రీలత, డాక్టర్ సాయిని స్వప్నిల్, న్యాయవాదులు రాచకొండ ప్రవీణ్ కుమార్, ఎగ్గడి సుందర్ రామ్, రామనాథం, వివేకానంద, వివిధ సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, తాడిశెట్టి క్రాంతికుమార్, గొల్లపెల్లి వీరాస్వామి, బుసిగొండ ఓంకార్, రజనీ కుమార్, తిరునగరి శేషు, చందా మల్లయ్య, కటకం నరింగరావు, పి అశోక్, చామకూర రాజు, అవ్వారు వేణు, కొమరయ్య యాదవ్, సి హెచ్ రాములు, వల్లాల జగన్ తదితరులు పాల్గొన్నారు.