Warangalvoice

Warangal Voice

బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్


వరంగల్ వాయిస్, హనుమకొండ : అంబేద్కర్ సెంటర్ వద్ద బీసీ యువజన సంఘం గ్రేటర్ అధ్యక్షుడు రాసురి రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు కొనసాగాలంటే, జనాభా దామాషా ప్రకారం బీసీల వాటా బీసీలకు దక్కాలంటే బీసీ లెక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందే అని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీ కుల గణపైన పార్లమెంట్ లో చట్టం చేయాలని, జనాభాలో 55% ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీలపై క్రిమిలేయార్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ అగస్టు 7న తల్కటోర స్టేడియంలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆగస్టు 8వ తేదీ రోజున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నుండి పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం 29 రాష్ట్రాల నుండి వస్తున్న వేలాది మంది బీసీ కార్యకర్తలతో చేపట్టనట్లు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. కావున వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు, బీసీ యువకులు, బీసీ మహిళలు, బీసీ విద్యార్థులు ఈ కార్యక్రమా నికి తరలిరావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల సంపత్ కుమార్ బీసీ యువజన సంఘం జిల్లా నాయకులు వెంకటేష్ రాకేష్, వినోద్, శివ, తరుణ్ అరవింద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *