ఆగస్టు 7న బీసీ మహాసభను విజయవంతం చెయ్యండి
చీఫ్ విప్ వినయ్ భాస్కర్
వరంగల్ వాయిస్, హనుమకొండ :ఆగస్టు 7న ఢిల్లీలో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఢిల్లీలో జరిగే బీసీల మహాసభ పోస్టర్ ను బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ దగ్గర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశంలోని బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన చర్చించడానికి ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో 10 వేల మంది బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ త్వరలో చేపట్టే జనాభా లెక్కలలో బీసీ కుల గణన చేపట్టాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ జనాభా ప్రాతిపదకన రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఓబీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఢిల్లీలో 29 రాష్ట్రాల నుంచి వస్తున్న 10 వేల మంది బీసీ ఉద్యమకారులతో ఓబీసీ మహా సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 8న జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బచ్చు ఆనందం, తాళ్ల సంపత్, జగనగాం శ్రీనివాస్, కాసగాని అశోక్, ఒడితల రాము, రాసురి రాజేష్, అరేగంటి నాగరాజు, పంజాల మధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
