వరంగల్ వాయిస్, దామెర : భారతీయ జనతా పార్టీ దామెర మండలం నూతన అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన వేల్పుల రాజ్ కుమార్ నియామకమయ్యారు. గత 15 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని వివిధ హోదాలలో ఉమ్మడి జిల్లా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా, గత స్థానిక ఎన్నికలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం దామెర వార్డు మెంబర్ గా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన సేవలను గుర్తించి దామెర మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ నియామకానికి సహకరించిన జిల్లా ఎన్నికల అధికారి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు మందు ఐలయ్య, కన్నబోయిన రాజయ్య యాదవ్, జిల్లా బీజేపీ నాయకులు గురుజాల శ్రీరామ్ రెడ్డి, కొండి జితేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు, మండలంలోని బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పార్టీ బలోపేతానికి, పార్టీ సూచించిన ఆదేశాల మేరకు అందరితో కలిసి పనిచేస్తానని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో దామెర మండలంలో గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
