Warangalvoice

eetela_rajender

బీజేపీ చీఫ్ గా ఈటల?

  • కలిసొస్తున్న రాజకీయ అనుభవం
  • బలమైన నాయకుడి కోసం పార్టీ అన్వేషణ

వరంగల్ వాయిస్, వరంగల్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ గా మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈటల రాజేందర్ పేరు తెరమీదకు వస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన, అనుభవం కలిగిన నేతగా గుర్తింపు ఉన్న ఈటలవైపే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ముగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవాలంటే ఈటెల రాజేందర్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉంటేనే సాధ్యమవుతుందని అధిష్టానం నమ్ముతోంది. ఈ క్రమంలో ఆయన పేరు దాదాపు ఖరారు అయిందని బీజేపీలో ప్రచారం సాగుతోంది.

నిజాం కోటపై కమలం జెండా..
నిజాం కోటపై కమలం జెండా ఎగురేసేందుకు బీజేపీ నేతలు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంటుంది తప్ప ఆశించిన స్థాయిలో బలోపేతం కాలేకపోతోంది. ఈసారి బలమైన నాయకత్వంలో తెలంగాణలో పాగా వేసేందుకు కేంద్ర నాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే నూతన అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారనే చర్చ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. గ్రామస్థాయి క్యాడర్ లో నిస్తేజం నెలకొన్న నేపథ్యంలో త్వరలోనే అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జోడు పదవులతో బిజీ..
ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేంద్రమంత్రిగా, జమ్ము కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జిగా ఆయన అదనపు బాధ్యతలు మోస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉండే నేతలకు ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి సైతం అధిష్టానానికి విన్నవించుకున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. వీలైనంత త్వరగా తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి కొత్తవారికి కట్టబెట్టాలని ఆయన కోరారట. దీంతో బీజేపీ నాయకత్వం అనుభవజ్ఞులైన నేతల కోసం అన్వేషణ ప్రారంభించారని తెలుస్తోంది. ఈ పదవి కోసం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఒక్క అవకాశం కల్పించాలని, వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు పార్టీని చేరువ చేస్తామని చెబుతున్నారట. అయితే బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందున ఈ సారి బీసీ నేతనే అధ్యక్షుడిని చేయాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఈటల అంటూ ప్రచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *