వరంగల్ వాయిస్, కరీమాబాద్ : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన గోగికార్ అనిల్ కుమార్ ను బీజేపీ ఓబీసీ మోర్చ కరీంనగర్ జిల్లా కో-ఇంచార్జిగా నియమించారు. ఈ మేరకు ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు కోవా లక్ష్మణ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాయకులకు అనిల్ పేరు పేరున ధన్యవాదలు తెలిపారు.
